TEJA NEWS TV : హోలగుంద మండలంలోని హెబ్బటం గ్రామంలో ప్రజలకు సైబర్ నేరాలు, సీసీ కెమెరాల ఉపయోగం, మత్తు పదార్థాలు,మహిళలపై నేరాలు, మరియు రోడ్డు ప్రమాదాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది.
ఈ అవగాహన కార్యక్రమంలో ఆలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ వెంకట చలపతి గారు, హోలగుంద పోలీస్ స్టేషన్ SI బాల నరసింహులు గారు, PSI M. భాష గారు మరియు సిబ్బంది పాల్గొనడం జరిగినది. ఇందులో భాగంగా ఇన్స్పెక్టర్ గారు మాట్లాడుతూ గంజాయి వంటి మత్తు పదార్థాలు, మట్కా గ్యాంబ్లింగ్ వంటి వ్యసనాల వలన వ్యక్తులు, కుటుంబాలు ఏ విధంగా నష్టపోతున్నాయి, సమాజం ఏ విధంగా నష్టపోతుంది వివరించడం జరిగినది. మహిళలపై జరిగే నేరాల గురించి, చిన్నపిల్లలపై జరిగే నేరాల గురించి ప్రజలకు అవగాహన కలిగించడం జరిగినది మరియు రోడ్డు ప్రమాదాలు వాటి వలన కలిగే నష్టాలు గురించి గ్రామ ప్రజలకు వివరంగా తెలపడం జరిగినది.
ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.
హొళగుంద :సైబర్ నేరాలు, సీసీ కెమెరాల ఉపయోగం, మత్తుపదార్థాలు,మహిళలపై నేరాలు, రోడ్డు ప్రమాదాల గురించి అవగాహన కార్యక్రమం
RELATED ARTICLES