Wednesday, November 19, 2025

హొళగుంద: సిఎం చంద్రబాబుతోనే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి సాధ్యం – కూటమి నాయకులు

TEJA NEWS TV :

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తోనే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి

ప్రజా సంక్షేమం.. రాష్ట్ర అభివృద్ధికై కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది

కూటమి పాలనపై హర్షం వ్యక్తం చేస్తున్న హొళగుంద మండల  ప్రజలు

ఆలూరు టిడిపి ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి కి ధన్యవాదాలు తెలిపిన హోళగుంద మండల కూటమి నాయకులు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తోనే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని హోళగుంద మండల కూటమి నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ముమ్మరంగా జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు, *టిడిపి మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య,మాజీ మండల కన్వీనర్ వీరన్న గౌడ్,మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పంపాపతి,సీనియర్ నాయకులు దుర్గయ్య,అబ్దుల్ సుబాన్,ముద్దన గౌడ్,దుర్గయ్య,జనసేన మండల కన్వీనర్ అశోక్,కో కన్వీనర్ వరాల వీరేష్,బిజెపి నాయకులు మహేష్,టీడీపీ టౌన్ అధ్యక్షులు అయ్యప్ప, సిబిఎన్ ఆర్మీ మోయిన్,ఆలూరు వలి, శాలి.అమాన్,అబ్దుల్ రహిమాన్,తిక్కస్వామి,తదితరులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి గ్రామ గ్రామాన బీటీ రోడ్లు, సీసీ రోడ్లు నిర్మాణాలతో రాష్ట్రం అభివృద్ధి వైపు దూసుకెళ్తుందని అన్నారు.* ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని హోళగుండ మండల పరిధిలో రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా చేపట్టడం జరుగుతోందని తెలిపారు.వైసిపి గత ఐదు ఏళ్ల పాలనలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని,ముఖ్యంగా మారుమూల మండలమైన హోళగుంద మండలంలో ఒక్క అభివృద్ధి పనికి శ్రీకారం చుట్టలేదని విమర్శించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ హయాంలో మండల పరిధిలో  చిన్నహ్యట రోడ్డు, హోన్నూర్ క్యాంప్ రోడ్డు,గ్రామాల్లో సి సి రోడ్డు నిర్మాణాలతో మండలం అభివృద్ధి వైపు దూసుకెళ్తుందని హర్షం వ్యక్తం చేశారు. మండలంలో తీవ్ర సమస్యగా మారిన ధనాపురం రోడ్డు నిర్మాణ పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి మాత్రమే కాకుండా ప్రజాసంక్షేమాన్ని ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం అమలుపరుస్తున్నామని అన్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలైన పెన్షన్ల పెంపు, మెగా డీఎస్సీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు, రైతులకు అన్నదాత సుఖీభవ వంటి సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్నామని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం ఎన్నికల్లో హామీలను అమలుపరుస్తున్న కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హోళగుంద మండల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్,ఆలూరు టీడీపీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి,టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ వైకుంఠం శివప్రసాద్ లకు ప్రజలు,కూటమి నాయకులు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన బిజెపి కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular