TEJA NEWS TV:
స్థానిక హోళగుంద వైయస్సార్ విగ్రహం నుండి ఎల్. ఎల్.సి.కాలువ వరకు రోడ్డుకు గ్రావెల్.
బీసీ కాలనీ వాల్మీకి యూత్ నాయకులకు సర్పంచ తనయుడు పంపాపతి తన వంతు సహకారం అందిస్తానన్నారు.



హోలగుంద మండల కేంద్రంలోని స్థానిక వైయస్సార్ విగ్రహం నుండి L.L.C.కాలువ వరకు రోడ్డుకు బీసీ కాలనీ వాల్మీకి యూత్ ఆధ్వర్యంలో రోడ్డుకు గ్రావెల్ వేయించడం జరిగింది.వర్షాకాలం దగ్గర వస్తుండడంతో అధిక వర్షాలు కురిస్తే ఈ రహదారికు రాకపోకలకు చాలా ఇబ్బందికరంగా గతంలో ఉండేది. ఎంతోమంది వాహనదారులు ప్రమాదాలకు గురయ్యారు.అది గమనించిన బీసీ కాలనీ వాల్మీకి యూత్ ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎదురు చూడడం కన్నా మన ఊరు రోడ్లు మనమే బాగు చేసుకుందామని తమ వంతుగా ఒక అడుగు ముందుకేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా తమ సొంత ఖర్చులతో ట్రాక్టర్లతో ఈ రోడ్డుకు గుంతల పడిన ప్రతిచోట గ్రావెల్ వేయించి చదును చేయడం జరిగింది.
మండలంలో ఉన్నటువంటి మండల అధికారులు వార్డు మెంబర్ నుండి జిల్లా స్థాయి వరకు ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ ప్రజలకు వాహనదారులకు ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు స్పందించి రోడ్లకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు విన్నవించుకుంటున్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ కాలనీ వాల్మీకి యూత్ నాయకులు కొండ బుడ్డన్న. జంజల్ మహేష్. మహానంది. తుంబులం సిద్ధప్ప. కురుకుంద నాగప్ప. కుంట సిద్ధ. కొరివి గోరేష్. రారాయి సిద్ధూ వాల్మీకి యూత్ నాయకులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు