

TEJA NEWS TV
ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి గారి ఆదేశాల మేరకు పోలింగ్
నెంబర్ 41, 42 , 43, ఇంచార్జ్ రారావి సిద్దు సీనియర్ నాయకుడు బుడగ జంగల్ రామాంజిని
అధికారులతో కలిసి లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా బూత్ ఇంచార్జ్ రారావి సిద్దు మరియు రామాంజని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి నెల ఒకటో తేదీన లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేస్తోందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే వృద్ధులకు, వితంతువులకు 4000/- వేలకు, వికలాంగులకు 6000 రూపాయలకు పెంచి లబ్ధిదారుల ఇంటి వద్ద అందిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో RBI అధికారి మరియు సీనియర్ నాయకుడు రామాంజిని రారావి సిద్దు, గోవింద్ రామయ్య , నాగప్ప , ఎర్రన్న పెన్షన్ లబ్ధిదారులు పాల్గొన్నారు.



