

TEJA NEWS TV
ఆలూరు తాలూకా, కర్నూలు జిల్లా హొళగుంద మండలం కేంద్రంలోని నెరాణికి తాండ గ్రామ శివారులోని అటవీ శాఖ ప్రాంతంలో నాటు సారా తయారీ జరుగుతున్న బట్టిలపై ఈరోజు పోలీసులు దాడి నిర్వహించారు.
ఈ దాడిలో సుమారు 350 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేయడం జరిగింది. నాటు సారా తయారీకి పాల్పడుతున్న నారాయణ నాయక్, నాగరాజు నాయక్ అనే ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు హొళగుంద ఎస్సై దిలీప్ కుమార్ గురజాల తెలిపారు.
ఈ దాడిలో కానిస్టేబుల్ వెంకటేష్, సుధాకర్, పెద్దన్న, రాజ్ గోపాల్ పాల్గొన్నారు. అటవీ ప్రాంతాల్లో నాటు సారా తయారీపై పోలీసులు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో, ఈ దాడి స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.