TEJA NEWS TV Holagunda Reporter Arun Kumar :హొళగుంద మండలంలోని నేరణికి తాండ గ్రామ శివారులోని కొండ ప్రాంతంలో నాటు సారా తయారీ చేస్తున్నట్లు అందిన సమాచారం మేరకు హొళగుంద ఎస్సై వి శ్రీనివాసులు ఆలూరు సబ్ సీఐ వెంకటేష్. పోలీసు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు.150 లీటర్లు బెల్లం ఉటను ధ్వంసం చేసి ఐదు లీటర్ నాటు సారాను సీజ్ చేసి నెరనికి తాండకు చెందిన లడుగు నాయక్ కుమారుడు మల్లేష్ నాయక్ పై కేసు నమోదు చేశారు.ఈ సందర్భంగా హొళగుంద ఎస్సై. వి. శ్రీనివాసులు మాట్లాడుతూ కర్నూల్ ఎస్పీ కృష్ణ కాంత్ ఐపీఎస్ ఉత్తర్వలు మేరకు ఆలూర్ సర్కిల్ ఇంచార్జ్ సిఐ పార్థసారథి సూచనలతో ఈ దాడులు నిర్వహించి కేసు నమోదు చేయడం జరిగిందని వారు తెలిపారు.నాటు సారా తయారు చేయడం. మరియు అమ్మడం నేరమని అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సూచనలు ఇవ్వడం జరిగింది.
హొళగుంద: నాటు సారా ధ్వంసం… కేసులు నమోదు – ఎస్సై శ్రీనివాసులు
RELATED ARTICLES