


TEJA NEWS TV
హొళగుంద మండలానికి గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి “హొళగుంద-కర్నూల్ మరియు కర్నూల్-హొళగుంద” బస్సు సర్వీసును గత కొన్ని రోజులుగా అర్ధాంతరంగా నిలిపివేయడం జరిగిందని కాగా జిల్లాలోని మారుమూల ప్రాంతమైన హొళగుంద వాసులకు విద్యా, వైద్య, ఉపాధిరీత్య కర్నూలు జిల్లా కేంద్రానికి చేరుకోవడానికి ఒకే ఒక్క రవాణా మార్గమైన “హొళగుంద-కర్నూల్ మరియు కర్నూల్-హొళగుంద” బస్సు సర్వీసును ఉన్నపళంగా నిలిపివేయడంతో మండల ప్రజలు మరియు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతుండటంతో పాటుగా మండలంలోని సులువాయి గ్రామ ప్రజలు,విద్యార్థులు మరియు రైతులు తమ పంటల అమ్మకాలకు వ్యవసాయ అవసరాలకు వ్యాపారాలకు విద్యా, వైద్య, ఉపాధిల కొరకు మండల కేంద్రానికి చేరుకోవడానికి బస్సు సర్వీసు లేక ప్రమాదకరమైన వాహనాల్లో ప్రయాణిస్తూ నానా ఇబ్బందులకు గురవుతు నరకయాతన అనుభవిస్తున్నారని ప్రజా అవసరాలు మరియు ఇబ్బందులను గూర్చి క్షుణ్ణంగా వివరిస్తూ బుధవారం నాడు టిడిపి సీనియర్ నాయకులు చిన్నహ్యట శేషగిరి, టిడిపి మండల కన్వీనర్ తిప్పయ్య, మాజీ కన్వీనర్ దుర్గయ్య తదితరుల బృందం రాయలసీమ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పూల నాగరాజు గారికి తమ అభ్యర్థనతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు.
ఈ కార్యక్రమంలో టిడిపి యువ నాయకులు ఖాదర్ బాషా, బుడగ జంగాల లక్ష్మన్న, కురవ మల్లికార్జున ఎల్లార్తి చిదానంద, మార్లమడికి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.