Wednesday, December 3, 2025

హొళగుంద: అర్హులైన వారికి పట్టాలు ఇవ్వాలి – పట్టాలు ఇచ్చిన వారికి ప్లాట్లు చూపించాలి- తాహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన ఎమ్మార్పీఎస్, ఏటియుసి నాయకులు



తేజ న్యూస్ టీవీ హొళగుంద

మండల కేంద్రం హొళగుంద లో  అర్హులైన నిరుపేదలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని, గతంలో జగనన్న కాలనీలో పట్టాలు ఇచ్చిన వారికి ప్లాట్లు చూపించాలని డిమాండ్ చేస్తూ ఎం ఆర్ పి ఎస్  ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ముందు  ధర్నాను నిర్వహించారు. అర్హులైన బాధితులతో కలిసి  అర్హులకు ఇంటి పట్టాలు ఇవ్వాలని, గతంలో పట్టాలు ఇచ్చిన వారికి ప్లాట్లు చూపించాలని , తాసిల్దార్ నిర్లక్ష్య వైఖరి నశించాలని  నినాదాలు చేస్తూ ఎమ్మార్పీఎస్ ఏఐటీయూసీ నాయకులు  సోమవారం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ నిజాముద్దీన్ కు మెమోరాండం సమర్పించిన నాయకులు ఆదోని డివిజన్ ఎం ఆర్ పి ఎస్ అధ్యక్షుడు పంచకుండగ వెంకటేష్, దళిత సమాఖ్య మండల అధ్యక్షుడు నల్ల మల్లేష్ మల్లేష్, హొళగుంద మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు ఇటిగిహాల్ వీరేష్ తదితరులు మాట్లాడుతూ హొళగుందలో గతంలో ఇంటి పట్టాల మంజూరులో అక్రమాలు చోటుచేసుకున్నాయని  పేదలను మరచి  పెద్దలకు పట్టాలు ఇచ్చారని విమర్శించారు. ఇల్లు అవసరం లేని వారికి రాజకీయ పలుకుబడి కలిగిన వారికి  జగనన్న కాలనీలో పట్టాలు ఇచ్చారని  అందువల్లనే ఇప్పటికి కూడా జగన్ కాలనీలో  నిర్మాణాలుమొదలు కాక ఖాళీ స్థలాలు ఉన్నాయని,  నత్తనడకన సాగుతున్నాయని పేర్కొన్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్న తమకు ఇంటి  స్థలాలు రాలేదని అర్హులైన నిరుపేదలు ప్రభుత్వ స్థలం కోసం దరఖాస్తు చేసుకోవడానికి  సచివాలయాలకు పోతే  ఇప్పటికే ఇంటి స్థలం మంజూరైనట్లుగా  కె ఎన్ ఎల్ నంబర్ ఉందని  మీకు దరఖాస్తు చేయడానికి వీలుపడదని  వెనక్కు పంపుతున్నారని  పేర్కొన్నారు. గతంలో జగన్ కాలనీలో నిరుపేదలకు  ఇంటి పట్టాలు ఇచ్చారని, పట్టాలు ఇచ్చిన అధికారులు ప్లాట్లు మాత్రం చూపించలేదని విమర్శించారు. దీంతో హొళగుందలో అర్హులైన నిరుపేదలకు ఇంటి స్థలాలు లేకుండా పోయాయని  ప్రభుత్వమేమో  పేదలందరికీ పక్కా ఇల్లు ఇస్తామని ప్రకటనలు ఇస్తుందని  అయితే అధికారుల నిర్లక్ష్య వైఖరితో  పేదలకు ప్రభుత్వ పక్కా ఇల్లు అందే పరిస్థితి లేదని  తెలియజేశారు. ఇదే సమస్యపై గతంలో సబ్ కలెక్టర్కు  వినతి పత్రం ఇవ్వడం జరిగిందని  సబ్ కలెక్టర్ ఆదేశాలను పాటించి పేదలకు న్యాయం చేయాల్సిన అధికారులు మేనమేషాలు లెక్క పెడుతూ  ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. వెంటనే సచివాలయాలలో కే ఎన్ ఎల్ నంబర్  నమోదు చేయబడి ఇంటి పట్టాలు పొందని అర్హులైన పేదల యొక్క దరఖాస్తులను  పరిశీలించి వారికి ఇంటి పట్టాలు మంజూరు చేసి స్థలాలు చూపించాలని, అదేవిధంగా జగన్ కాలనీలో అధికారుల అక్రమాల కారణంగా  పట్టాలు పొందినప్పటికీ స్థలం పొందలేని అర్హులైన నిరుపేదలకు జగన్ కాలనీలో వెంటనే స్థలాలు చూపించాలని  డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి వెంటనే ఇంటి స్థలాలు మంజూరు చేసి అర్హులకు స్థలాలు చూపించకపోతే  ఎం ఆర్ పి ఎస్  ఆధ్వర్యంలో ఇతర ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని పేదలకు న్యాయం జరిగే వరకూ  వారి తరఫున అధికారులపై పోరాడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఆదోని డివిజన్ కమిటీ మెంబర్ ఎల్లార్తి మహేష్, కోగిల తోట గోవర్ధన్, సినిమా మంగన్న, వార్డు మెంబర్ వీరేష్, గ్రామ అధ్యక్షుడు మృత్యుంజయ, కొలిమి ముత్తయ్య  గౌరమ్మ రంగమ్మ నాగవేణి సుశీలమ్మ నీలమ్మ షేకన్న మల్లయ్య దుర్గన్న సిద్ధప్ప సిద్దయ్య స్వామి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular