కర్నూలు జిల్లా హొళగుంద మండల కేంద్రంలో బహుజన టైమ్స్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక జడ్పీ హైస్కూల్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థుల కోసం సావిత్రిబాయి పూలే జీవితంపై ఎస్సే రైటింగ్ పోటీలు నిర్వహించారు. పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుజన టైమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ దుర్గాప్రసాద్ బహుమతులు అందజేశారు.
అనంతరం మండల అభివృద్ధి కార్యాలయంలో మహిళా ఉపాధ్యాయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు కేక్ కట్ చేసి సావిత్రిబాయి పూలే జయంతిని ఉత్సాహంగా జరుపుకున్నారు. తరువాత బహుజన టైమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ దుర్గాప్రసాద్ 52 మంది మహిళా ఉపాధ్యాయులను పూలమాలలు, సాలువలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, సావిత్రిబాయి పూలే మహిళలకు ఆదర్శప్రాయమైన వ్యక్తిత్వమని అన్నారు. ఆమె చేసిన త్యాగాలు మరువలేనివని, స్త్రీలు మరియు అణగారిన వర్గాలు చదవకూడదనే సామాజిక ఆంక్షలు ఉన్న కాలంలో విద్యాసంస్థలను స్థాపించి స్వయంగా బోధన చేస్తూ ఎన్నో అవమానాలు భరించారని గుర్తు చేశారు. అయినప్పటికీ విద్యే విముక్తికి మార్గమని నమ్మి అక్షరాస్యతతో పాటు విమర్శాత్మక ఆలోచనలను ప్రోత్సహించారన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంఈఓ టు. కబీర్ సాబ్, బీజేపీ సీనియర్ నాయకులు చిదానంద, బీసీవై పార్టీ అడ్వకేట్ అర్జున్, ఐసిడిఎస్ సూపర్వైజర్ శిబారాణి, ఎంపీపీ తనయుడు ఈసా, హెల్త్ ఆఫీసర్ సిహెచ్‌వో చంద్రశేఖర్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
హొళగుందలో బహుజన టైమ్స్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు
RELATED ARTICLES



