హొలగుంద మండలం పాఠశాలలు, కళాశాలలకు సమయానికి విద్యార్థులు చేరుకునేలా బస్సు సర్వీసులు నడపాలని YSRCP విద్యార్థి విభాగం అధ్యక్షుడు కొండా అమారేష్ ఆదోని డిపో మేనేజర్‌కు వినతి పత్రం సమర్పించారు.
ఆలూరు–హొలగుంద మార్గంలో సులువాయి మీదుగా నడిచే బస్సు సమయాలు విద్యార్థులకు ఇబ్బందిగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. విరుపాపురం, సులువాయి, పెద్దహేట, సమతగేరి, ఎల్లార్తి, బిజె హళ్లి, హేబ్బటం, కోగిలతోట గ్రామాల విద్యార్థులు బస్సు ఆలస్యంగా రావడం వల్ల మొదటి పిరియడ్ మిస్ అవుతున్నారని, ఆటెండెన్స్‌లో సమస్యలు ఎదుర్కొంటున్నారని వివరించారు.
విద్యార్థుల కోసం బస్సు ఉదయం 8 గంటలకు, సాయంత్రం 5 గంటలకు పాఠశాల, కళాశాల సమయానికి అనుగుణంగా నడపాలని డిమాండ్ చేశారు.
ఈ వినతి పత్రం సమర్పణలో జిల్లా ఉపాధ్యక్షుడు SK గిరి, నాయకులు రావి, మరిమల్ల తదితరులు పాల్గొన్నారు.
హొలగుంద మండలం విద్యార్థుల సమస్యపై YSRCP విద్యార్థి విభాగం వినతి
RELATED ARTICLES