
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
భద్రాచలం, జనవరి 10:
ప్రతిరోజూ బ్రతుకుతెరువు కోసం బరువులు మోస్తున్నాం. అయితే, ప్రాణాలను కాపాడుకోవడానికి హెల్మెట్ మోసేందుకు వెనుకాడుతామా?
రక్షణ ఎప్పుడూ మొదటి ప్రాధాన్యత కావాలి. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకుండా ప్రయాణించడం ప్రమాదకరం. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు భద్రాచలం ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్మెంట్ వినూత్న ప్రయత్నం చేసింది.
హెల్మెట్ ధరించని వాహనదారులకు నమస్కారం చేస్తూ, “నన్ను ధరించు – నిన్ను రక్షిస్తా” అనే సందేశాన్ని హెల్మెట్ ద్వారానే తెలియజేశారు. ఈ కార్యక్రమం చాలా మందిని ఆలోచింపజేసింది. హెల్మెట్ ఒక భారం కాదని, అది ప్రాణాలను కాపాడే రక్షణ కవచమని స్పష్టంగా తెలియజేశారు.
భద్రాచలం ఆర్టీఏ కార్యాలయానికి వచ్చే దరఖాస్తుదారులకు, డ్రైవర్లకు ఉదాహరణలతో అవగాహన కల్పిస్తున్నట్లు మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ శ్రీ సంగం వెంకట పుల్లయ్య, తెలిపారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని ఆయన సూచించారు.
హెల్మెట్ ధరించండి – భద్రంగా ఇంటికి చేరండి!