ఆళ్లగడ్డ, జూన్ 23: సచివాలయ ఉద్యోగులు తమ స్వంత మండలాల్లోనే విధులు నిర్వహించే అవకాశం కల్పించాలని కోరుతూ ఆళ్లగడ్డ మున్సిపల్ కార్యాలయం ఎదుట సోమవారం ఆందోళన నిర్వహించారు.
సచివాలయ సిబ్బంది నాయకుడు బాలస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నేషనల్ ఇంక్రిమెంట్లు, జాబ్ చార్ట్ అమలు, సీనియర్ అసిస్టెంట్ పోస్టులకు తగిన పే స్కేల్ వర్తింపునకు సంబంధించి తమ డిమాండ్లు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. అనంతరం వారు మున్సిపల్ కమిషనర్ కిశోర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఉద్యోగుల హక్కులను కాపాడేందుకు పోరాటం కొనసాగుతుందని సంఘ నాయకులు స్పష్టం చేశారు.
స్వంత మండలాల్లో ఉద్యోగ అవకాశం ఇవ్వాలని సచివాలయ సిబ్బంది డిమాండ్
RELATED ARTICLES