Tuesday, December 24, 2024

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు సత్తా చాటాలి— రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
పాల్వంచ మండలం
8-12-2024



తెలంగాణాలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ అభ్యర్థులను గెలిపించి, తమ సత్తా చాటాలని *రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు* అన్నారు.

పాత పాల్వంచలో *కొత్వాల* స్వగృహంలో యూత్ కాంగ్రెస్ కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన కొంతమంది కమిటీ సభ్యులు *కొత్వాల* ను కలవగా, ఆయన వారిని శాలువా, బొకేలతో సన్మానించారు.

ఈ సందర్భంగా *కొత్వాల* మాట్లాడుతూ *పార్టీ కార్యకర్తల కృషి* వలనే గత ఎన్నికల్లో *కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో విజయదుందుభి మోగించిని* అధికారంలోకి వచ్చిందన్నారు. *యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ప్రభుత్వ పథకాలను* వివరించి, ప్రజలను పార్టీ వైపు మళ్లించాలని *కొత్వాల* వారిని కోరారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన *వీరమల్లు గణేష్, మెలిగ మహేష్, బండి నాగరాజు* లను సన్మానించారు.

ఈ కార్యక్రమంలో *మాజీ ZPTC యర్రంశెట్టి ముత్తయ్య, LDM కోఆర్డినేటర్ బద్ది కిషోర్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోండం వెంకన్న, కాంగ్రెస్ నాయకులు బాశెట్టి సోమయ్య, నూనావత్ సుమన్ నాయక్, అజ్మీరా హుస్సేన్, ఇమ్రాన్, Y వెంకటేశ్వర్లు, కందుకూరి రాము, డిష్ నాగేశ్వరరావు, కాపా శ్రీను, సూర్య కిరణ్*, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular