Friday, March 14, 2025

స్కూల్ నైట్ వాచ్మెన్ ఎంపిక

TEJA NEWS TV :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ గుమ్మనూరు జయరాం ఆదేశాల మేరకు హొళగుంద మండలం గజ్జెహళ్లి గ్రామంలో మండల వైస్ ఎంపీపీ &ఎంపీటీసీ తనయుడు ఎస్. కెంచప్ప* ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు నైట్ వాచ్ మెన్ ఉద్యోగంను హరిజన యల్లప్ప గారిని నియమించడం జరిగింది. ఈ సందర్భంగా యల్లప్ప మాట్లాడుతూ నాకు ఈ ఉద్యోగం ఇచ్చిన మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగనన్నకు రాష్ట్ర మంత్రివర్యులు గుమ్మనూరు జయరాం ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని వైసీపీ పార్టీకి నిరంతరం కృషి చేస్తానని మరొకసారి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు మండల వైస్ ఎంపీపీ & ఎంపిటిసి తనయుడు ఎస్. కెంచప్ప బోయ రమేష్, బోయ చిన్న ముకయ్య, హరిజన ఎల్లప్ప, నాగప్ప తదితరులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ గుమ్మనూరు జయరాం శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular