కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని జంపాపురం సాతనురు కొట్టాల గ్రామాలను కలిపే మట్టి రోడ్డుపై ఎర్రనేల వాగుగా పిలుచుకునే వంక ఈ మధ్య కూరిసిన భారీ వర్షాలకు తెగి రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచేలా చేసింది. ఇరు గ్రామాల రైతులకు వారి పొలాలకు వెళ్లడానికి అనువైన దారి అదే కావడంతో రెండు గ్రామాల రైతులు కూడా నానా ఇబ్బందులతో ప్రమాదకర స్థితిలో పొలం పనులకు వెళ్లి వచ్చేవారు. ఈ వాగు తెగిపోవడంతో వర్షం వస్తే కనీసం నడిచి వెళ్లడానికి కూడా అవకాశం లేనంత ఎక్కువగా నీరు ప్రవహిస్తుండటంతో కొన్ని కొన్ని సార్లు రైతులు తమ పొలం పనులకు కూడా వెళ్లకుండా ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు అనేకం. ఇటు నాయకులు గాని ప్రభుత్వ అధికారులు గానీ వారిని పట్టించుకునే పాపాన పోలేదు. అయితే రైతులు మాత్రం పెట్టుబడితోపాటు తమ వ్యవసాయ పనులకు ఆటంకం కలిగించే వాగును తామే స్వయంగా బాగు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు అనుకున్న వెంటనే జంపాపురం గ్రామానికి చెందిన రైతులు y.చిదానంద, మాజీ ఎంపిటిసి గురు రాజా, డీలర్ బసవరాజులు తమ సొంత ఖర్చులతో వాగుకు మరమ్మతులు చేయించి తమ చుట్టుపక్క రైతులకు అండగా నిలిచారు. వాగు మరమ్మతులు చేయించిన రైతులను తోటి రైతులు అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు.
సొంత ఖర్చులతో తెగిన వాగుకు మరమ్మతులు చేయించుకుంటున్న రైతులు
RELATED ARTICLES