భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
మాలబంజార గ్రామపంచాయతీ సర్పంచ్ కునుసోత్ నాగలక్ష్మి, తమ గ్రామపంచాయతీ యువకుల, కు ఆటవస్తువులు క్రికెట్ బ్యాట్స్ వికెట్స్, వాలీబాల్స్, నెట్టు షటిల్ నెట్, బ్యాట్స్ ఇప్పించారు. శనివారం ఉదయం సర్పంచ్ చేతుల మీదుగా క్రీడాకారులకు అందించారు. క్రీడాకారులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ గ్రామస్థాయి నుండి మండల స్థాయి మండల స్థాయి నుండి జిల్లా స్థాయికి కిడారంగంలో రాణించి మంచి స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాతలు నిలబెట్టాలని మన గ్రామ పంచాయతీ పేరును నిలబెట్టి మీరు మంచి క్రీడల్లో పేరు సంపాదించాలని కోరుకుంటూ మీకు క్రీడ రంగానికి మీకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా యూత్ మాట్లాడుతూ మా గ్రామ పంచాయతీకి కొత్తగా ఎన్నికైన సర్పంచ్ నాగలక్ష్మి పంచాయితీ అభివృద్ధి పథకంలో తీసుకెళ్లి అలాగే పంచాయతీలోనే కాకుండా మండల జిల్లాలో మరెన్నో పదవులు పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్, కున్సోత్ నాగలక్ష్మి, ఉప సర్పంచ్ లావుడ్యా అరుణ, యూత్ సభ్యులు క్రీడాకారులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
సుజాతనగర్ : గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయికి క్రీడాకారులు ఎదగాలి- సర్పంచ్ నాగలక్ష్మి
RELATED ARTICLES



