Wednesday, February 5, 2025

సాగునీటి సంఘాల ఎన్నికలకు సర్వం సిద్ధం…

ఆళ్లగడ్డ మండలంలోని పలు సాగునీటి సంఘాల ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు మండల తహసిల్దార్ జ్యోతి రత్నకుమారి తెలిపారు. బుధవారం తమ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆళ్లగడ్డ మండలంలోని మైనర్ ఇరిగేషన్, కె సీ కెనాల్, తెలుగు ఆయకట్టు కింద మొత్తం 14 సాగునీటి సంఘాలు ఉన్నాయన్నారు.
అలాగే 116 టి.సీలు గుర్తించడం జరిగిందన్నారు. సాగునీటి సంఘాలు టీ సీలకు ప్రభుత్వం త్వరలో  ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆమె ఎందుకు సంబంధించి ఓ టర్ లిస్టును సిద్ధం చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయకట్టు దారుల వివరాలను తహసిల్దార్ వెల్లడించారు. ఓటర్ లిస్టులను ప్రిపేర్ చేసి తుది జాబితా సిద్ధంగా ఉంచడం జరిగిందని అన్నారు.
జిల్లా కలెక్టర్ అనుమతితో త్వరలోనే ఫైనల్ పబ్లికేషన్ విడుదల చేయడం జరుగుతుందన్నారు. ఎన్నికల నిర్వహణకు పోలింగ్ కేంద్రాలను కూడా గుర్తించడం జరిగిందన్నారు. మైనర్ ఇరిగేషన్, తెలుగు గంగ, కేసీ కెనాల్  ఆయకట్టు కింద  11,754, పురుష ఓటర్లు , 4620 మహిళా ఓటర్లు ఉన్నారన్నారు. మైనర్ ఇరిగేషన్ కింద 1120 ఓటర్లు, 459 మహిళా ఓటర్లు ఉన్నారన్నారు. కేసీ కెనాల్ సంబంధించి 5948 పురుషులు, 200452 మహిళా ఓటర్లు ఉన్నారని, అలాగే తెలుగు ఆయకట్టు కింద 4686 పురుష ఓటర్లు, 1709 మహిళా ఓటర్ల తో కూడిన జాబితాను విడుదల చేయడం జరిగిందని తహసిల్దార్ జ్యోతి రతకుమారి వివరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular