సంగెం మండల కేంద్రంలో ఎంఈఓ ఆఫీస్ వద్ద గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో డిఆర్ డిఓ కౌసల్యాదేవి మహిళా స్వశక్తి కుట్టు కేంద్రాల ద్వారా కుట్టిన పాఠశాలల ఏకరూప దుస్తువులు విద్యా శాఖ మండల ఎమ్ఈఓ సంగెం విజయ్ కుమార్ కి అందించారు.
ఎస్ హెచ్ జి మహిళలు ‘మహిళా స్వశక్తి కుట్టు కేంద్రాల’ ద్వారా మండలంలోని ముప్పై ఆరు పాఠశాల 2263 ఏకరూపక దుస్తువులు ప్రభుత్వం నిర్దేశించిన గడువును ముందే కుట్టినందుకు మహిళలను అభినందించారు, జిల్లాలో అన్ని మండలాలు కూడా శుక్రవారం రోజు వంద శాతం విద్యా శాఖ మండల అధికారులకు అందించారాని తెలిపారు.
స్కూల్ యూనిఫామ్స్ స్టిచ్చింగ్ లో గడువు తేది కంటే ముందే అందించినందుకు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అలాగే మహిళలను మరియు డిఆర్డీఓ కౌసల్యాదేవి ని, వారి సిబ్బందిని అభినందించారు .ఈ కార్యక్రమంలో అదనపు డిఆర్ డిఓ రేణుకా దేవి, డీపీఎం భవాని, జేడీఎం అంజనీ దేవి, ఎంపీడీఓ రవీందర్, ఏపియం కిషన్, ఎంఈఓ విజయ్ కుమార్, ఎంఎన్ఓ నర్సింహా చారి, శాంతి మండల సమైక్య అధ్యక్షులు కల్యాణి, కార్యదర్శి రాజమని, కోశాధికారి రేణుక, సీసీలు సురేశ్,కుమారస్వామి,ఎలియా,రాజయ్య, స్వరూప, కృష్ణ మూర్తి,కృష్ణ,సుజాత, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సర్కారు బడి దుస్తువులు పంపిణీ
RELATED ARTICLES