

హోళగుంద,జనవరి 3,
తెలుగుదేశం పార్టీ ఆలూరు ఇన్చార్జి వైకుంఠం జ్యోతి గారి సహకారంతో మహిళలకు 50% సబ్సిడీతో కుట్టు మిషన్లను టీడీపీ కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య, జనసేన కన్వీనర్ అశోక్ బీజేపీ మండల కన్వీనర్ ఈ ప్రసాద్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అబ్దుల్ సుబాన్,మండల ప్రధాన కార్యదర్శి గోవిందు గౌడ్, మైనార్టీ సీనియర్ నాయకులు ఆదం,మండల కార్యదర్శి హుసేన్ పీరా,సీనియర్ నాయకులు డి ఎస్ బాషా,, తెలుగుయువత మండల అధ్యక్షుడు బాకాడి వీరేష్ టీడీపీ సీనియర్ నాయకులు రైస్ మిల్ మురళి వైకుంఠం యువసేవ ల్యాబ్ గిరి మండల మైనార్టీ అధ్యక్షులు మోయిన్, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రెహ్మాన్,, కో కన్వీనర్ వరాల వీరేష్,46 బూత్ కన్వీనర్ టి పి సాయిబేష్ 38 బూత్ ఇంచార్జీ ఆలూరు వలి భాషా 40 బూత్ ఇంచార్జీ షాలి అమన్ 35 బూత్ ఇంచార్జీ తయార్ యూనిట్ కో క్లస్టర్ రారవి సిద్దు కోనేరు భాస్కర్ రమేష్ ఇంచార్జీ బోయ మల్లికార్జున తదితరులు మండల కేంద్రంలో స్థానిక రాజా నగర్ కాలనీలో మహిళలకు 30 కుట్టు మిషన్లను 50% సబ్సిడీపై అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమిపాలనలో రాష్ట్రంలో అభివృద్ధితోపాటు, ప్రజా సంక్షేమంతో దూసుకెళ్తుందని తెలిపారు.ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి గారి ఆలూరు నియోజకవర్గం అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి కట్టుబడి పని చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి గారి సహకారంతో సబ్సిడీపై మహిళలకు కుట్టు మిషన్లు అందజేయడం జరిగిందని తెలిపారు. కుట్టు మిషన్ లబ్ధిదారులు అయినా మహిళలు మాట్లాడుతూ బయట మార్కెట్లో 14 వేల ధర ఉన్న కుట్టు మిషన్ ను 50% సబ్సిడీతో 7000 రూపాయలకు అందించడం సంతోషదాయకమని,టిడిపి ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి గారికి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టిడిపి యువ కూటమి నాయకులు కార్యకర్తలు,మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



