Friday, April 4, 2025

సన్న బియ్యం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి :చెరుకు శ్రీనివాస్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సన్న బియ్యం పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి కోరారు. గురువారం చేగుంట పట్టణంలో గల చౌక ధరల దుకాణంలో లబ్ధిదారులకు సన్న బియ్యం బియ్యం పథకాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలోని ప్రజలందరికీ సన్నబియ్యాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ఎక్కడైనా అవకతవకలు జరిగితే చర్యలు తీసుకోవాలని తాసిల్దార్ ని ఆదేశించారు. తాసిల్దార్ శ్రీకాంత్ మాట్లాడుతూ అర్హులందరికీ సన్న బియ్యం అందిస్తామన్నారు. ప్రభుత్వానికి సన్నాలు అందించిన రైతులకు రూ 500 బోనస్ అందించమన్నారు. సన్న వడ్లు బిల్లింగ్ చేసి ఈ పథకాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే లబ్ధిదారులు అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. జిల్లాలోని ఎంఎల్ఎస్ పాయింట్లలో సరిపడ సన్న బియ్యం అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల  కాంగ్రెస్ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, తాసిల్దార్ శ్రీకాంత్, ఎంపీడీవో చిన్నారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మసాయి పెట్ శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ కొండి శ్రీనివాస్, పి ఎ సి ఎస్ భాగయ్యా, మ్యాకల పరమేష్, వెంగల్ రావు, భాస్కర్, సండ్రుగు శ్రీకాంత్, సాయికుమార్ గౌడ్, మోహన్ నాయక్, డీలర్లు, కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular