కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం గంగులపాడు గ్రామం – విద్యార్థులకు విలువలు, సంస్కారం నేర్పాల్సిన ప్రధానోపాధ్యాయుడు తానే ఆ సంస్కృతిని తుంగలో తొక్కాడు. మధ్యాహ్న భోజన సమయంలో పాఠశాలలో పర్యటించిన మండల విద్యాశాఖ అధికారి రామ్మూర్తి పక్కనే… కాళ్లకు చెప్పులు వేసుకున్న ప్రధానోపాధ్యాయుడు పిల్లల మధ్య తిరుగుతూ కనిపించాడు.
ఆ సమయంలో విద్యార్థులు నేలపై కూర్చుని అన్నం తింటుంటే… ఆయన మాత్రం పాదరక్షలతో ప్లేట్ల దగ్గర తిరగడం, గ్రామస్తుల ఆగ్రహానికి గురైంది.
**⚡ విమర్శల వర్షం**
“అన్నం పరబ్రహ్మ స్వరూపం” అని చెప్పాల్సిన వారే… పిల్లల ప్లేట్లలో చెప్పుల దుమ్ము, మట్టి పడేలా నిర్లక్ష్యంగా ప్రవర్తించారని గ్రామస్తులు మండిపడ్డారు. జిల్లా కలెక్టర్ లాంటి ఐఏఎస్ అధికారులు కూడా పిల్లలతో చెప్పులు విప్పి నేలపై కూర్చుని భోజనం చేసిన ఉదాహరణలు ఉన్నా… ఈ ప్రధానోపాధ్యాయుడికి మాత్రం ఆలోచనే రాలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
**📸 ఫోటో కోసం నాటకం?**
పిల్లల పౌష్టికాహారం, పాఠశాల వాతావరణం మెరుగుపరచడం కన్నా… ఫోటోలు, పోజులు ఇవ్వడమే ముఖ్యమని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై స్థానికులు, తల్లిదండ్రులు ఆగ్రహంతో స్పందిస్తూ… “సంస్కారం నేర్పాల్సిన గురువుగారే సంస్కృతి మర్చిపోతే, పిల్లలు ఏం నేర్చుకుంటారు?” అని ప్రశ్నిస్తున్నారు.
సంస్కారం నేర్పేవాళ్లే… సంస్కృతి మర్చిపోతే ఎలా?” పిల్లల భోజనశాలలో చెప్పులతో తిరిగిన ప్రధానోపాధ్యాయుడు
RELATED ARTICLES



