TEJA NEWS TV : మృతుల కుటుంబాలను పరామర్శించారు మాజీ ఎమ్మెల్యే చల్లా
తేజ న్యూస్ టివి ప్రతినిధి
సంగెం మండలం గవిచర్ల, ఎల్గూర్ స్టేషన్, ఏల్గూర్ రంగంపేట గ్రామాలలో ఇటీవలే వివిధ కారణాలతో మృతి చెందిన గుళ్లపల్లి సాయిలు,గుళ్ళపల్లి కుమార్, బోల్ల కుమార్,బోనాల కృష్ణమూర్తి,ఆశ కుటుంబాలను పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శుక్రవారం పరామర్శించారు.ఈ సందర్భంగా మృతుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం వారి మృతికి గల కారణాలను కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు.
మాజీ ఎమ్మెల్యే వెంట. సంగెం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పసునూరి సారంగపాణి, రెడ్ క్రాస్ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, దోనికల శ్రీనివాస్,ఎంపిటిసిలు ప్రజాప్రతినిధులు,బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు ఉన్నారు.