తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం
సంగెం మండల కేంద్రంలో డాక్టర్ బి, ఆర్, అంబేద్కర్ వర్ధంతి నివాళులు మండలం లో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. ప్రపంచంలోనే గొప్ప మహానుభావుడు భారత రాజ్యాంగ నిర్మాణంలో అతి కీలకమైన పాత్ర ధారి అలుపెరుగని పోరు చేసిన భారత రత్న ఆర్థిక వేత్త నాయ్య కోవిదుడు
అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు ఎలా అందాలో గొప్ప నిర్దేశం చేసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు.డా బి ఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ద్వారానే రిజర్వేషన్లు పొందుతున్నామని అన్నారు. వారి చూపిన స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పని చేస్తుందన్నారు,ఈ కార్యక్రమంలో మండల అధికారులు.ఎంపిడిఓ రవీందర్, ఎం ఆర్ ఓ ,రాజకుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, చోల్లేటి మాధవరెడ్డి, మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మెట్టపల్లి రమేష్, అచ్చ నాగరాజు,వివిధ గ్రామాల ముఖ్య నాయకులు, కార్యాకర్తలు ప్రజలు పాల్గొన్నారు.
సంగెం మండల కేంద్రంలో డాక్టర్ బి, ఆర్, అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్బంగా ఘన నివాళి
RELATED ARTICLES