
తేజ న్యూస్ టివి ప్రతినిధి.
సంగెం మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో 17వ డివిజన్ మరియు సంగెం మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు
కేక్ కట్ చేసి స్వీట్స్ పండ్లు పంపిణీ చేశారు
అనంతరం వారు మాట్లాడుతూ కొండా కుటుంబం బడుగు బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం వహించే కుటుంబం ఆపదలో వున్న ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చేసే వ్యక్తి పేదల కోసం ప్రతి కార్యకర్త కు వెన్నంటు వుండే మంచి మనస్సు అటు రాజకీయాల్లో గాని ఇటు ప్రజలలో ఒక ప్రజా సేవకుడుగా ఒక దేవుని గా పేరు సంపాదించుకున్న కొండా మురళీ ధర్ రావు అని అన్నారు, ఈ సందర్భంగా అలాగే మండల కేంద్రంలో
శ్రీ చిట్టిమల్ల రమేష్ బాబు
చిట్టిమల్ల జ్యువెలర్స్ విశ్వకర్మ వీధి వరంగల్ వారి ఆధ్వర్యంలో
అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమంలో కడిదెల కట్టస్వామి యాదవ్ ( కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు) మాందాడి లక్ష్మారెడ్డి ( వరంగల్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి) బొమ్మల కట్టయ్య ( మాజీ ఎంపీపీ) గుండేటి ఎల్లయ్య ( మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు) మెట్టుపల్లి ఏరియా( కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ వైస్ ప్రెసిడెంట్ ) అల్లెపు శ్యామ్ ( కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు) మరియు డివిజన్ మండల ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొని యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



