TEJA NEWS TV TELANGANA
సంగెం మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు అప్పే నాగార్జున శర్మ తండ్రి శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయ అర్చకులు అప్పే నాగేశ్వర ప్రసాద్ శర్మ నిన్న అకాల మరణం చెందడం జరిగింది.విషయం తెలిసిన పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆయన భౌతిక దేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు.అదేవిధంగా గ్రామంలో ఆదివారం రోజు ఉదయం అకాల మరణం చెందిన మేదరి స్వాగత్(సన్నీ) పార్థీవ దేహాన్ని సందర్శించి మాజీ ఎమ్మెల్యే నివాళులు అర్పించారు.
అనంతరం వారి మృతికిగల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.మృతుల కుటుంబాలకు ఆదుకుంటామని మాజీ ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
