తేజ న్యూస్ టివి ప్రతినిధి
బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, వరంగల్ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్ రావు తండ్రి నిమ్మగడ్డ సుబ్బారావు ఇటీవల మరణించగా వారి స్వగ్రామం సంగెం గుంటూరుపల్లి గ్రామం లో వారి దశదిన కర్మ కార్యక్రమానికి హాజరై వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి . అదేవిధంగా ఇటీవల మృతి చెందిన తీగరాజుపల్లి గ్రామ మాజీ ఎంపిటిసి ఇటికాల బాబురావు కుటుంబసభ్యులను మాజీ ఎమ్మెల్యే ఓదార్చి పరామర్శించారు. అలాగే ఆత్మకూరు మండలం నాగయ్య పల్లి గ్రామంలో అనారోగ్య కారణాలతో మృతి చెందిన పువ్వుల చిన్న సాంబార్ రెడ్డి అప్పాని బుచ్చి వీరు మాదాసి వీరలక్ష్మి కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే పరామర్శించారు ఈ కార్యక్రమంలో ఎం హెల్ సి, పోచంపల్లి శ్రీనివాస్,తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు ,మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ మాజీ ఎం పి, ఆరురి రమేష్ , మాజీ రైతు విమోచన సమితి చైర్మన్ నాగూర్ల వెంకన్న , మాజీ జెడ్పీటీసీ గూడ సుదర్శన్ రెడ్డి, మాజీ కూడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి ప్రదీప్ రావు,మాజీ ఎమ్మెల్యే బస్వరాజు సారయ్య,మాజీ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి,వివిధ నాయకులు,కార్యాకర్తలు తదితరులు పాల్గొన్నారు.