నేడు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన నందిగామ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి
ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యురాలుగా నాకు అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉపముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దేశ ప్రధాని నరేంద్ర మోడీ నారా చంద్రబాబునాయుడు పవన్ కళ్యాణ్ త్రిమూర్తులు లా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని రమాదేవి అన్నారు. అందులో భాగంగా సనాతన ధర్మం పరిరక్షణ కోసం నేడు అమ్మవారి ఆలయ కమిటీని కూటమి ప్రభుత్వం నియమించింది. ధర్మో రక్షతి రక్షితః అనే విధంగా ధర్మసంస్థాపన కోసం మా వంతు మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా రమాదేవి తెలియజేశారు. ఆలయంలోని ధర్మకర్తల మండల సభ్యులంతా కలిసి చైర్మన్గా శ్రీ బొర్రా రాధాకృష్ణ ని ప్రతిపాదించడం జరిగింది. ఆయనకు మరియు నూతనంగా నియమించబడ్డ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు రమాదేవి._*
*_ప్రమాణ స్వీకారం అనంతరం ఆలయ అర్చకులు నూతనంగా ఏర్పడిన కమిటీ సభ్యులతో కలసి చైర్మన్ ని వేద ఆశీర్వచనంతో ఆశీర్వదించారు. తదనంతరం ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు._*
*_ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు కొలుసు పార్థసారథి …. ప్రభుత్వ విప్, నందిగామ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య .. శాసన సభ్యులు వర్ల కుమార్ రాజా …. పాల్గొని తంబళ్ళపల్లి రమాదేవి కి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు…_*
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి
RELATED ARTICLES



