
ఎన్టీఆర్ జిల్లా నందిగామ
శ్రీ తిరుపతమ్మ తల్లి ఆలయంలో అడ్డగోలు దోపిడీ.
వలన ప్రాంగణం మొత్తం రద్దీగా ఉంటుంది. ఆలయంలో జరిగే ప్రతి కార్యక్రమానికి ఆలయ అధికారులు వేలం పాటల ద్వారా కాంట్రాక్టులు ఇవ్వడం జరుగుతుంది. కానీ కొంతమం ది అక్రమార్కులు దేవాలయంలో ప్రవేశించి దేవా లయ అధికారుల కన్నుల్లో అక్రమంగా దేవాలయంలోకి ప్రవేశించే వాహనాలకు ప్రవేశ రుసుమును వసూలు చేస్తున్నట్లు తెలు స్తుంది. ఇది ప్రభుత్వ నిబంధనలకు పూర్తి విరుద్ధం. ఆలయం. లోని పార్కింగ్ ప్రదేశాల్లో ఉన్న వాహ నాలకు మాత్రమే పార్కింగ్ చార్జీలు వసూలు చేసే వెసులు బాటు కలదు. కానీ కాంట్రాక్టర్ అక్రమార్జనకు ఆశపడి అక్రమ మార్గంలో భక్తుల నుండి నిలువు దోపిడీకి తెరలేపారు. ఆలయంలోకి ప్రవేశించే ప్రతి వాహన దారుల నుండి అక్రమంగా 50 రూపాయల నుండి 500 రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఈ విధంగా ఆల యానికి వచ్చిన భక్తులను అక్రమార్కులు నిలువు దోపిడి చేస్తూ ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నారని భక్తులు వాపోతున్నారు. ఈ విధంగా ఆలయానికి
శ్రీతిరుపతమ్మఅమ్మవారి దేవస్థానం
వచ్చిన భక్తుల నుండే కాకుండా ఆ ప్రాంతానికి వచ్చిన అమాయకుల నుండి కూడా అక్రమ వసూలు చేస్తున్నారు. కనుక ఇప్పటికైనా దేవాదాయ శాఖ అధికారులు స్పందించి ఎటువంటి అనుమతులు లేకుండా ప్రవేశ రుసుము వసూలు చేస్తున్న అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకొని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అమ్మవారి భక్తులు కోరుతున్నారు…



