TEJANEWSTV TELANGANA
చేగుంట స్థానిక శ్రీ కృష్ణవేణి పాఠశాలలో ముందస్తుగా నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా విద్యార్థిని,విద్యార్థులు వివిధ సంస్కృతిక నృత్యాలతో అలరించారు. అలాగే పాఠశాల యొక్క క్యాలెండర్ను చేగుంట పట్టణ సర్పంచ్ శ్రీమతి సండ్రుగు స్రవంతి సతీష్, ప్రముఖ సంఘ సేవకులు అయిత పరంజ్యోతి, సండ్రుగు శ్రీకాంత్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ద్యావ రేణుక లింగమూర్తి, మాట్లాడుతూ,ప్లాస్టిక్ రహితంగా పాఠశాల విద్యార్థి విద్యార్థులు పాఠశాలను పూర్తిగా ప్లాస్టిక్ రహిత పాఠశాలగా మార్చారని చెప్పారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ పులబోయిన నాగరాజు,ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ముందస్తుగా నూతన సంవత్సర వేడుకలు
RELATED ARTICLES



