TEJA NEWS TV (ఆళ్లగడ్డ నియోజకవర్గం )
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ముడీమేల సందీప్ ను పరామర్శించిన మాజీ ఎంపీ గంగుల ప్రతాప రెడ్డి
నంద్యాల జిల్లా శిరివెళ్ళ గ్రామానికి చెందిన వై.యస్.ఆర్.సి.పి కాపు సామాజిక నేత ముడీమేల నాగరాజు కుమారుడు ముడీమేల సందీప్ ఈ నెల 3 వ తేదీన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు కాగా 40 వ జాతీయ రహదారి పై శిరివెళ్ళ నుండి నంద్యాల కళాశాలకు ద్విచక్ర వాహనం పై వెళ్తుండగా గోవిందపల్లే సమీపంలో కారు కు దారి ఇవ్వబోయి పక్కనే ఉల్లిగడ్డ ల లోడుతో నిలిచి వున్నా ఆటో నీ “ ఢీ ” కొనడంతో రోడ్డు ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో ముడీమేల సందీప్ ఎడమ మోకాలి భాగంలో గాయమైంది అయితే స్థానిక కార్యకర్త ల ద్వారా విషయం తెలుసుకున్న మాజీ నంద్యాల పార్లమెంట్ సభ్యుడు గంగుల ప్రతాప రెడ్డి సందీప్ ను పరామర్శించి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. సందీప్ ఆర్.జి.యమ్ కళాశాలలో చివరి సెమిస్టర్ పరీక్షలు రాయాలని అందుకు హాజరు శాతం తక్కువ గా వుంటే పరీక్షలు రాయడానికి వీలు కాదని సందీప్ మాజీ ఎంపీ కి తెలుపగా కళాశాల చైర్మన్ తో మాట్లాడి పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తామని ఈ సందర్భంగా మాజీ ఎంపీ గంగుల ప్రతాప రెడ్డి భరోసానిచ్చారు. అనంతరం రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఛానళ్ల కు ధీటుగా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ అతి తక్కువ సమయంలోనే ప్రజల మరియూ అధికారుల యొక్క దృష్టిలో సుస్థిర స్థానాన్ని పొందుతున్న తేజా న్యూస్ టీవీ ఛానల్ 2023 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అలాగే ఆయన మాట్లాడుతూ ఇలాగే ప్రజల పక్షాన నిలిచి ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తూ ప్రజల ఆదరణ పొంది సమాజంలో నంబర్ వన్ న్యూస్ చానల్ గా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. మాజీ ఎంపీ గంగుల ప్రతాప రెడ్డి తో పాటు వై.యస్.ఆర్.సి.పి కాపు సామాజిక నేత ముడీమేల నాగరాజు , 3 వ వార్డ్ మెంబర్ ఇట్టెం హరి , శిరవెళ్ళ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ బసాపురం ఇంతియాజ్ , నాయకులు దాది రెడ్డి తిమ్మరాయుడు , కమ్మ సుబ్బారాయుడు , ముళ్ళ అన్వర్ బాషా , పెసరవాయి రఫీ , నాగన్న , ప్రతాప్ , అబు బక్కార్ , తదితరులు ఉన్నారు.