TEJA NEWS TV :
రూ౹౹ 10 లక్షలతో నూతన సిసి రోడ్డు పనులు
*హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామ ప్రజలు
_శిరివెళ్ళ మండల పరిధిలోని జీనే పల్లె గ్రామంలో ఇటీవల గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు *గంగుల బిజేంద్రా రెడ్డి ( నాని ) గారు పర్యటించగా గ్రామ ప్రజలు సీసీ రోడ్డు కావాలని కోరగా త్వరలోనే వేయిస్తమని హామీ ఇచ్చారు._
_ఇచ్చిన హామీ ప్రకారం *గ్రామ యువ నాయకులు కైప రఘునాథ రెడ్డి అధ్యక్షతన గ్రామ సర్పంచ్ దగడ మహేశ్వరి రాజారెడ్డి , వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ చీమల రమేష్* లు గ్రామంలో రూ౹౹ 10 లక్షలతో నూతన సీసీ రోడ్డు నిర్మాణం కోసం శంకుస్థాపన చేసి పనులు చేపట్టారు._
_ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల అభివృద్దే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు గంగుల ప్రభాకర్ రెడ్డి , ఆళ్లగడ్డ నియోజకవర్గ శాసనసభ్యులు గంగుల బ్రిజేంద్రా రెడ్డి లు పనిచేస్తున్నారని వారన్నారు._
_ఎమ్మెల్సీ , ఎమ్మెల్యే సహాయ సహకారాలతోనే గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు అన్ని విధాల కృషి చేస్తున్నమన్నారు._
_గ్రామంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విధాల కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు._
_ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మునయ్య , ఇంజనీరింగ్ అసిస్టెంట్ హసన్ , సచివాలయ సిబ్బంది , వార్డు వాలంటీర్లు , గ్రామ ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు._
శిరివెళ్ల గ్రామ అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
RELATED ARTICLES