TEJA NEWS TV : తెలుగుదేశం పార్టీ హయాంలో ఎమ్మెల్యేగా ఉన్న రాజంపేట శాసనసభ్యులు మెడ వెంకట మల్లికార్జున్ రెడ్డి మూడు సంవత్సరాల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మేడ 850 కోట్లతో రాజంపేట నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేశానని ఆ క్రెడిట్ మా తల్లి మేడ లక్ష్మీనరసమ్మకు అంకితం అని ఒక పుస్తకాన్ని విడుదల చేశారని.మరి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా గెలిచి మూడున్నర సంవత్సరాలు పూర్తయిందని ఈ వైసీపీ ప్రభుత్వంలో
రాజంపేట నియోజకవర్గాన్ని ఎన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశావో మరొక పుస్తకాన్ని రిలీజ్ చేసి మీ తల్లి గారైన లక్ష్మీనరసింహకు ఆ క్రెడిట్ అంకితం చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి & రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ గౌరవ,,శ్రీ బత్యాల చంగల్ రాయుడు గారు డిమాండ్ చేశారు…, నేడు 24-01-2023వ తేదీ మంగళవారం నాడు రాజంపేట పట్టణంలోని నియోజకవర్గ టిడిపి కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బత్యాల గారు మాట్లాడుతూ గంజాయి వనంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు 850 కోట్లతో అభివృద్ధి పనులు చేపడితే తులసివనమైన వైసీపీ ప్రభుత్వంలో మీరు ఎమ్మెల్యేగా విజయం సాధించి మూడున్నర సంవత్సరాలు అయిందని ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో రాజంపేట నియోజకవర్గంలో ఎన్ని కోట్లతో మీరు అభివృద్ధి పనులు చేపట్టారు.ఏ పనులు చేపట్టారో మరొక పుస్తకాన్ని విడుదల చేసి ప్రజలకు వివరించాల్సి ఉందని ఆయన కోరారు., ఆ పుస్తకానికి అయ్యే ఖర్చు కూడా రాజంపేట తెలుగుదేశం పార్టీ భరిస్తుందని వివరించారు.పట్టణంలోని వారందరికీ పేరుకు భవనాలు కట్టిస్తానని 1279 మంది దగ్గర డబ్బులు తీసుకున్నారని వారికి ఇంతవరకు ఇల్లులు నిర్మించలేదని తెలిపారు., ఇల్లులు నిర్మించుకుంటే పోతే పోనీ వారి వద్ద తీసుకున్న డబ్బులను వడ్డీతో సహా వారికి చెల్లించాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా వారి సొంత ఊరికి రహదారి కూడా సరిగా వేసుకోలేకపోయారని అన్నారు.చంద్రబాబు నాయుడు హయాంలో ఎమ్మెల్యేగా గెలిచి 850 కోట్లతో అభివృద్ధి పనులు చేసిన మీరు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం లోకి వచ్చిన మూడున్నర సంవత్సరంలో ఎన్ని కోట్లతో ఏ పనులు చేశారో ప్రజలకు వివరిస్తే సంతోషపడతారని పేర్కొన్నారు………., ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, పదాధికారులు పాల్గొన్నారు.
వైకాపా పాలనలో ఏం సాధించారో ఒక పుస్తకాన్ని విడుదల చేయాలన్న ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి
RELATED ARTICLES