
TEJA NEWS TV Holagunda Reporter Arun Kumar : ఈరోజు అఖిల భారత వీరశైవ లింగాయితీ రాష్ట్ర అధ్యక్షుడు దండిన శివానందకు సత్కారం. ఆదివారం బళ్ళారి జిల్లా కేంద్రంలో అమరేశ్వర స్వామి దేవాలయం పక్కన ఉన్న ఫామ్ హౌస్ లో ఏర్పాటు చేసిన సన్మానం కార్యక్రమంలో ప్రజా రక్షణ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గడిగే బసవరాజు, గాళి యువరాజ్,వీరశైవ లింగాయితీ వేదికే బళ్ళారి జిల్లా అధ్యక్షుడు, హొళగుంద ఒకటవ వార్డు సభ్యుడు గడిగే రుద్రగౌడ,పత్రిక విలేఖరి టి.ఉమాపతి, అఖిల భారత వీరశైవ లింగాయితీ మహాసభ బళ్ళారి, విజయనగర జిల్లా అధ్యక్షుడు చానహల్ శేకర్, వాణిజ్య విభాగ గంటక నిర్దేశకులు తోటద విరేశ్ ఇతర నాయకులు కలిసి రాష్ట్ర అధ్యక్షుడు శివానంద ను సన్మానం చేశారు.కర్నూల్ జిల్లా అధ్యక్షుడిగా యువరాజ్,మండలం యువ నాయకుడిగా గాళి ధనుంజయ్ కు పదవిని కల్పించాలని కోరారు.



