నేడు 25-01-2023వ తేదీ మంగళవారం నాడు రాజంపేట పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపాలని సిపిఐ, సిఐటియూసి వారు చేస్తున్న నిరసన దీక్షలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి & రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ గౌరవ శ్రీ భత్యాల చెంగల్ రాయుడు గారు పాల్గొని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరుపున మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 32 మంది సామాన్య ప్రజలు బలిదానాలతో, 26 వేలమంది రైతుల త్యాగాలతో, 67 మంది శాసనసభ్యులు ఏడుగురు పార్లమెంట్ సభ్యులు రాజీనామాలతో “ఆంధ్రుల హక్కు – విశాఖ ఉక్కు” సాధించబడిందని.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు లేకపోయినా సొంత గనులు కేటాయించక పోయిన తక్కువ కర్చుతో నిర్విఘ్నంగా నడుస్తున్నదని తెలిపారు.
విశాఖ ఉక్కు ఉద్యమ సమయంలో నేను కూడా భాగస్వామి అయినందుకు గర్వంగా చెప్పుకుంటున్నానని అన్నారు.
నేడు 35,000 మంది పర్మినెంటు, కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రత్యక్షంగా, లక్ష మందికి పరోక్షంగా ఉపాధి చూపిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు 50 వేల కోట్లు పన్నులు, ఇతర డివిజన్ల రూపంలో సమకూర్చింది., కేవలం 5000 కోట్ల కేంద్ర మూలధనంతో ఇంత స్థాయికి ఎదిగిన పరిశ్రమను, రాష్ట్ర అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న ఫ్యాక్టరీని ప్రత్యేకించి విశాఖను అభివృద్ధి పథంలో నిలిపిన సమస్తను కేంద్ర సర్కారు ప్రైవేటీకరిస్తారని తెగేసి చెప్తున్నది.
రాష్ట్రంలో ఉన్న ఏకైక భారీ పరిశ్రమ తెలుగు ప్రజలు భావోద్వేగాలతో, బలిదానాలతో, నిర్మితమైన ఉక్కు ఉత్పత్తిలో దేశంలోనే మన్నికైన నాణ్యమైన ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగంలోనే నిలబెట్టుకోవడానికి రెండు సంవత్సరాలుగా విశాఖ స్టీల్ కార్మికులు నిర్వాసితులు రాష్ట్రంలోని అన్ని తరగతులు, విభాగాల ప్రజలు రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల ఉద్యమాలు పోరాటాలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే అని అన్నారు.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు……….., ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు టిడిపి నాయకులు, కార్యకర్తలు, ఇంకా సిపిఐ, సిఐటియూసి నేతలు పాల్గొన్నారు.