TEJA NEWS TV
హొళగుంద మండలంలోని సులువాయి గ్రామానికి వచ్చే విద్యార్థి బస్సు సమయానికి అనుగుణంగా రాలేదని విద్యార్థులు మంగళవారం రోడ్డుపై బైఠాయించారు. వారికి విద్యార్థి, ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపారు. సీఐటీయూ నాయకుడు నాగరాజు మాట్లాడుతూ.. బస్సు సమయానికి రాకపోవడంతో విద్యార్థులు సమయానికి పాఠశాల, కళాశాలలకు వెళ్లలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు తెలిపారు.
విద్యార్థుల రోడ్డుపై బైఠాయింపు
RELATED ARTICLES