భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
తేదీ: 24-10-2025 స్థలం: చర్ల మండలం
చర్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలను ప్రగతిశీల యువజన సంగం (PYL) నాయకులు ఈ రోజు సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు ముసలి సతీష్ మాట్లాడుతూ —
“ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన మెనూ ప్రకారం భోజనం ఇస్తున్న పరిస్థితి లేదు. పాఠశాలలు ప్రారంభమై దాదాపు ఐదు నెలలు అవుతున్నా, విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం కాకుండా కేవలం నీళ్ల చారుతో అన్నం ఇస్తున్నారు. శుక్రవారం రోజున గుడ్డు ఇవ్వాలి కానీ, గత ఐదు నెలలుగా ఒక్క రోజైనా గుడ్డు ఇవ్వలేదు. ఈ పరిస్థితి గురించి MEO కి తెలిసినా చర్యలు తీసుకోవడం లేదు. కాబట్టి DEO తక్షణమే స్పందించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము,” అన్నారు.
అలాగే ఆయన ఇంకా చెప్పారు —
“పాఠశాలలో విద్యార్థులకు తాగడానికి మంచి నీటి సదుపాయం రెండు సంవత్సరాలుగా లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలో పనిచేస్తున్న వర్కర్లు యాజమాన్యం మాట వినకపోవడంతో, భోజనం వడ్డించే బాధ్యతను యాజమాన్యమే చేపట్టింది. ఈ పరిస్థితి వెంటనే సరిచేయాలని, విద్యార్థుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని PYL డిమాండ్ చేస్తోంది. లేదంటే విద్యార్థులను ఐక్యం చేసి ఉద్యమాలు ప్రారంభిస్తాము,” అని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో యువ నాయకులు కొట్టె నవీన్ రెడ్డి, పెద్దిరెడ్డి సంతోష్, వినోద్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల పొట్టకొడుతున్న చర్ల ప్రభుత్వ పాఠశాల – HM పట్టించుకోలేదు, MEO తక్షణ చర్యలు తీసుకోవాలి: PYL జిల్లా ఉపాధ్యక్షులు ముసలి సతీష్
RELATED ARTICLES



