సంగెం మండల కేంద్రంలో మార్గం స్వచ్ఛంద సేవా సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వేసవి శిబిరం నందు దాత పసునూరి అరవింద్ పుట్టినరోజు సందర్భంగా నిరుపేద విద్యార్థులకు నోటు పుస్తకాలు మంగళవారం అందజేశారు. తల్లి లలిత మాట్లాడుతూ తన కుమారుడు పసునూరి అరవింద్ పుట్టినరోజు వేడుకలు చిన్నారుల మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు చిన్నారులు ప్రభుత్వ పథకాలతో, మార్గం సంస్థ ద్వారా విద్య దానంతో బాగా చదువుకోని తలిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలనికోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్ష,కార్యదర్శులు బొజ్జ సురేశ్, సింగారపు బాబు, కుటుంబ సభ్యులు తల్లి లలిత, తమ్ముడు విగ్నేష్, ఉపాధ్యాయులు కరుణ శ్రీ, కిషన్ కుమార్, యాదగిరి ,పరిమళ, విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు ఉచిత నోటు పుస్తకాల పంపిణీ
RELATED ARTICLES