కామారెడ్డి జిల్లా బీబీపేట మండల పరిధిలోని గ్రామాల్లో వ్యవసాయ విస్తరణ అధికారులు విత్తనాల కొనుగోలులో రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు రైతులకు సూచించడం జరిగింది. వారు మాట్లాడుతూ… విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు వ్యవసాయ శాఖ నుండి అనుమతి ఉన్న షాపులలో మాత్రమే కొనుగోలు చేయాలని, తప్పనిసరి కొనుగోలు చేసాకా వాటికి సంబంధించిన రశీదులు తీసుకోవాలి, విత్తనాల ఖాళీ సంచులను పంట కాలం ముగిసేవరకి రైతులు తమ వద్దే భద్రపరచాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమాన్ని ఇస్సానగర్ లో ఏఈఓ రాఘవేంద్ర, మందాపూర్ లో ఏఈఓ సాగర్ మరియు శివారు రాంరెడ్డిపల్లె లో ఏఈఓ లత నిర్వహించారు.
విత్తనాల కొనుగోలులో రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు
RELATED ARTICLES