TEJA NEWS TV :
పార్వతీపురం జిల్లా పాలకొండ లో జరిగిన అండర్18 కబడ్డీ పోటీ కి ఎంపికైన టీమ్ ఇరోజు పాలకొండ నుండి వైజాగ్ బయలు దేరుతున్న సందర్భంగా పాలకొండ టి డి పి సీనియర్ నేత పల్లకొండలరావు గారు టీమ్ ను జెయీ బవా విజయీ బవా అంటూ దీవించి ఆటకి అవసరమైన కిట్లు ను అందించి ఆయన దాతృత్వం ను చాటు కొన్నారు పల్లకొండబాబు గారు మాట్లాడుతూ మిమ్మల్ని చూస్తుంటే నా చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి నాకు ఆటలంటే మహా ఇష్టం అందులో క్రికెట్ , కబడ్డీ అంటే చెవి కోసుకునేంత ఇష్టం మా తల్లి తండ్రులు అడ్డు చెప్పేవారు కాదు అంటూ తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు .ముఖ్యంగా చెప్పవలసింది ఏమిటంటే మీరు ఆచి తూచి అడుగులకు మడుగు లేసి ఎక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలి చూసి మరి ఆడండి తిరిగి బంగారు పథకంతో వొచ్చి మన జట్టు పవర్ ఏమిటో చూపించాలి
అంటూ దీవించి పంపారు
ఈ కార్యక్రమానికి రిటైర్డ్ పి ఈ టి రెడ్డి గారు కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ వెన్నెపు చంద్రరావు పాల్గొని టీమ్ ను వైజాగ్ పంపారు
విజయకాంక్షలతో పాలకొండ టీమ్ వైజాగ్ బయలుదేరింది|అండర్-18 కబడ్డీ పోటీకి సిద్ధం!
RELATED ARTICLES