వాహన దారులు కు గుడ్ న్యూస్
ఎవరి
వాహనాలను వారు తీసుకవెళ్ళండి.
*పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ ఘటనల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను యజమానులకు అప్పగించడానికి నిర్ణయించినట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను హనుమకొండ భీమారం, సి.ఆర్ పి. ఎఫ్ కేంద్రంలో భద్రపర్చారు. వాటిని పోలీస్ స్టేషన్ల వారిగా గుర్తించి సబంధిత వాహన యజమానులకు నోటీసులు కూడా పంపారు. తగిన ఆధారాలతో వచ్చిన యజమానులకు వాహ నాలను తిరిగి అంద జేయనున్నారు. మరింత సమాచారం కోసం సెల్ నంబర్లు 8712685143, 8712685158, 8712584557 యజమానులు సంప్రదించాలని పోలీస్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.