TEJA NEWS TV
మెదక్ జిల్లా చేగుంట మండల వడియారం కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీలు చేయాలని జిల్లా డిఅర్ ఓ భుజంగరావు ఆదేశించారు.
మంగళవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా చేగుంట మండలం వడియారం గ్రామంలో పి ఎ సిఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డి ఆర్ ఓ, తాసిల్దార్ శ్రీకాంత్,సంబంధిత వ్యవసాయ అధికారులతో కలిసి పరిశీలించారు.
అనంతరం ధాన్యం సేకరణ, ట్యాబ్ ఎంట్రీలు, కొనుగోలు కేంద్రం ద్వారా ఇప్పటి దాకా సేకరించిన ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ధాన్యం సేకరించిన వెంటనే వాటి వివరాలను ట్యాబ్ ఎంట్రీ చేయాలని సూచించారు. నాణ్యతా ప్రమాణాలు మేరకు ధాన్యం తీసుకువచ్చిన రైతుల నుంచి నిబంధనల ప్రకారం తూకం వేయాలని ఆదేశించారు. ధాన్యం డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో పడేలా చూడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఆర్ఓ, చేగుంట తాసిల్దార్ శ్రీకాంత్, ఏపీఏం, నర్సమ్మ, గిర్ధావర్, జయ భారత రెడ్డి, సంతోష్ రావు, ఐకెపి సిబ్బంది, రైతులు, తదితరులు పాల్గొన్నారు
వరి ధాన్యం కొనుగోలు కేంద్రలను పరిశీలించిన డిఆర్ ఓ భుజంగరావు
RELATED ARTICLES