
తేజ న్యూస్ టివి ప్రతినిధి,
వరంగల్ మహానగర పాలక సంస్థ 16వ డివిజన్ ధర్మారం కీర్తి నగర్ గరీబ్ నగర్ లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో స్థానిక *16వ డివిజన్ కార్పొరేటర్ సుంకర మనీషా శివకుమార్* పర్యటించారు.
ఈ సందర్భంగా తుఫాను వల్ల వచ్చిన అకాల వర్షాలకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని శిథిలావస్థలో ఉన్న ఇళ్ళలో గాని, చెరువుల వద్దకు గాని వెళ్ళవద్దని సూచించారు అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ముంపు ప్రాంతాలకు సహాయ చర్యలను అందించాలని వరదల వల్ల ఇబ్బంది పడ్డ ప్రజలను తగిన చర్యలు తీసుకొని పునరావాస కేంద్రాలకు పంపించాలని అధికారులకు సూచించారు .
ఈ కార్యక్రమంలో అధికారులు,శానిటేషన్ జవాన్లు,అర్బన్ మలేరియా సిబ్బంది మరియు స్థానిక బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు..



