తేజ న్యూస్ టివి ప్రతినిధి.
హనుమకొండ నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నీట మునిగిన ప్రాంతాలను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా పలు కాలనీలలో గృహ నిర్బంధంలో ఉన్న ప్రజల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి పోలీసులకు సమాచారం అందిస్తూ ఉండాలన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వెంటనే స్పందించాలని కోరారు.
వరదముప్పు ప్రాంతాలను పరిశీలించిన వరంగల్ కమిషనర్
RELATED ARTICLES



