మెదక్ జిల్లా వడియారం గ్రామంలో ఈనెల 3వ తేదీన దొంగలుగా భావించి జంగారై గ్రామానికి చెందిన మోహన్, మహిపాల్, అనే వ్యక్తిపై పెట్రోల్ చల్లి నిత్యం నిప్పండించిన సంఘటనలో వడియారం గ్రామానికి చెందిన రామకృష్ణ,రమేష్, అనిల్, ముగ్గురు వ్యక్తులను రిమాండ్ చేసి తరలించినట్లు రామాయంపేట సిఐ వెంకట రాజా గౌడ్ తెలిపారు, చేగుంట మండలం వడియారం గ్రామంలో ఈనెల 3వ తేదీన ఇద్దరు వ్యక్తులు బైకులు దొంగలిస్తున్నట్లుగా భావించిన గ్రామస్తులు వారిని చితకబాది వారిపై పెట్రోల్ చల్లి నిప్పంటించిన సంఘటన చోటుచేసుకుంది ఈ సందర్భంగా తూప్రాన్ డిఎస్పి నరేందర్ గౌడ్ రామాయంపేట సిఐ వెంకటరాజా గౌడ్ చేగుంట ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి లు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు పెట్రోల్ పోసిని పంపించిన మహిపాల్ అనే వ్యక్తి మరియు అతనితోపాటు మోహన్ అను ఇద్దరూ జంగా రాయి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు వీరిలో మహిపాల్కు తీవ్ర గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు, ఈ సందర్భంగా నేడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ వెంకట రాజా గౌడ్ మాట్లాడుతూ చట్టాన్ని ఎవరు కూడా అతిక్రమించకూడదని చట్టాన్ని ఎవరు కూడా చేతులకు తీసుకోకూడదని ఆయన తెలిపారు దొంగలుగా భావించి పెట్రోల్ చల్లి నిప్పంటించిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు.
వడియారంలో పెట్రోల్ పోసి నిప్పు అంటించిన కేసులో ముగ్గురు రిమాండ్
RELATED ARTICLES


 
                                    


