భద్రాచలం పట్టణంలోని లిటిల్ ఫ్లవర్స్ విద్యాసంస్థలు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా డైరెక్టర్లు మాగంటి శ్రీనివాస వరప్రసాద్ మరియు మాగంటి రమేష్ బాబు మాతృభాషను కన్నతల్లి వలె గౌరవించాలని, భాషల కనుమరుగవుతున్న నేపథ్యంలో మన మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేశారు. తెలుగు భాషకు ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు ఉందని, సంస్కృతి సంప్రదాయాలు మన భాషలో ప్రతిబింబిస్తాయని వారు తెలిపారు.
లిటిల్ ఫ్లవర్స్ విద్యాసంస్థల వ్యవస్థాపకులు మాగంటి సూర్యం తెలుగు భాష కవులను, కళాకారులను సన్మానించి గౌరవించారని, భాష ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేయడానికి కవి సమ్మేళనాలు నిర్వహించారని డైరెక్టర్లు వివరించారు.
తెలుగు భాష పండితులు తులసీదాస్, వేణు, బాలాజీ, శ్రీను లిటిల్ ఫ్లవర్స్ విద్యాసంస్థలు మాతృభాష పరిరక్షణ కోసం చేసిన కృషిని అభినందించారు. కార్యక్రమం విజయవంతం చేసినందుకు కో డైరెక్టర్ మాగంటి సాయి సూర్యను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
లిటిల్ ఫ్లవర్స్ విద్యాసంస్థల లో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం వేడుకలు
RELATED ARTICLES