Wednesday, February 5, 2025

రైతు నాయకులు అమ్మినేనికి ఎంఎల్ఏ ఘన సత్కారం

TEJA NEWS TV :
రైతు సమస్యలపై పెద్ద‌ఏత్తున పోరాటాలు చేసిన అమ్మినేని జ్వాలా..
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తీవ్రంగా వ్యతిరేకించిన అమ్మినేని
రైతులకు మేలు చేసేందుకు కృషి చేస్తా..అమ్మినేని జ్వాలాప్రసాద్
(,నందిగామ) :
రైతులకు మేలు చేసేందుకు నిరంతరం కృషి చేస్తానని,గతంలో రైతుల పక్షాన అనేక సమస్యలపై అలుపెరుగని పోరాటం చేశామని రైతు నేత అమ్మినేని జ్వాలాప్రసాద్ అన్నారు.
స్థానిక శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య కార్యాలయంలో పలువురు నేతలను ఘనంగా సత్కరించారు. ఎన్నికల సమయంలో *తంగిరాల సౌమ్య* ఆదేశాలతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ప్రజలలోకి తీసుకొని వెళ్ళటానికి ప్రముఖ పాత్ర

వహించిన తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి *అమ్మినేని జ్వాలా ప్రసాద్* ని శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అమ్మినేని జ్వాలా ప్రసాద్ మాట్లాడూతూ ఈ సత్కారంతో మరింత బాధ్యత పెరిగిందని అన్నారు. రైతుల అభ్యున్నతే ద్యేయంగా పనిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో 14వ వార్డు కౌన్సిలర్ కామసాని సత్యవతి తెలుగుదేశం పార్టీ నాయకులు కొండూరు వెంకటరమణ (వెంకట్రావు ) మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు 14 వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు….

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular