తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం
సంగెం మండలం కాపుల కనపర్తి ఎఫ్ ఏ సి ఎస్ ఆధ్వర్యంలో కాపుల కనపర్తి సొసైటీ యందు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని,గత ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని అన్నారు.
ఏ గ్రేడ్‌కు రూ. 2320, కామన్ రకానికి రూ.2300 ధర చెల్లిస్తుందని, రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు.సన్న రకం ధాన్యానికి రూ.500 బోనస్ అందిస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం 17% మాయుచర్ ఉండాలి అని అన్నారు.
కేవలం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో మాత్రమే సన్నధాన్యానికి బోనస్ లభిస్తుందన్నారు. రైస్ మిల్లులో విక్రయాలకు బోనస్ వర్తించదని ప్రతి ఒక్క రైతుకు ఈ విషయంపై అవగాహన కల్పించాలని సూచించారు.ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలికసదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. రవాణ, హమాలీలు, గోనె సంచుల కొరత రాకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాపుల కనపర్తి సొసైటీ చైర్మన్ దొమ్మటి సంపత్, వరంగల్ జిల్లా సహకార అధికారి నీరజ, తహశీల్దార్ రాజ్ కుమార్, ఎంపీడీవో రవీందర్, మండల వ్యవసాయ అధికారి,యాకయ్య, సొసైటీ డైరెక్టర్లు సదిరం చేరాలు,బిక్షపతి, కిషన్ నాయక్,భాస్కర్, సిఈఓ రమణాచారి,సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చొల్లేటి మాధవరెడ్డి, అధికార ప్రతినిధి జనగాం రమేష్, మండల మైనార్టీ అధ్యక్షులు ఎండి పాషా, మాజీ సర్పంచ్ కిషోర్, మాజీ ఉప సర్పంచ్ సారంగం, గ్రామ పార్టీ అధ్యక్షులు సదిరం చంద్రమౌళి,కందిమళ్ల శ్రీకాంత్,నాయకులు పసునూరిభాస్కర్,చంటి,సంజీవ,సుమన్ నాయకులు, రైతులు,హమాలీలు తదితరులు పాల్గొన్నారు.
రైతులు దళారుల చేతిలో మోసపోవద్దు – పరకాల నియోజకవర్గం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
RELATED ARTICLES