TEJA NEWS TV:రైతు భరోసా నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి జూన్ 1న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పత్తికొండకు రానున్నారు. పర్యటన వివరాలను అధికారులు మంగళవారం రోజున వెల్లడించారు. జూన్ 1న ఉదయము ఎనిమిది గంటలకు అమరావతిలోని సీఎం తన ఇంటి నుండి గన్నవరం ఎయిర్ పోర్టుకు బయలుదేరుతారు. ఉదయం 8:20 నిమిషాలకు గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. 8:30 నిమిషాలకు గన్నవరం నుండి కర్నూల్ కు బయలుదేరుతారు. 9:20 నిమిషాలకు కర్నూలు ఓర్వగల్లు ఎయిర్పోర్ట్ లో విమానం దిగుతారు. 9:30 నిమిషాలకు స్థానికనాయకులతో మాట్లాడతారు. 9:35కు ఓర్వగల్లు ఏర్పోర్ట్ నుండి హెలిప్యాడ్ ద్వారా పత్తికొండకు బయలుదేరుతారు. ఉదయం 10 గంటలకు పత్తికొండ జూనియర్ కళాశాల మైదానంలో హెలిప్యాడ్ ద్వారా దిగుతారు. 10:10 నిమిషాల నుండి జూనియర్ కళాశాల మైదానం నుండి పత్తికొండలోని సెయింట్ జోసెఫ్ పాఠశాల వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభ రోడ్ షో ద్వారా బస్సులో బయలుదేరుతారు.10:25.ని బహిరంగ సభకు హాజరవుతారు.10:35 ని వరకు ఫోటో ఎగ్జిబిషన్ తిలకిస్తారు.10:45 ని సభ జ్యోతి ప్రజ్వాల చేసి కార్యక్రమంలో పాల్గొంటారు.11:05ని రైతు భరోసా వీడియో ప్రదర్శన 11:15 నుండి 11:50 వరకు సీఎం జగన్ ప్రసంగిస్తారు.11:55 ని బ్యాంకు ఖాతాలకు రైతు భరోసా పథకం బటన్ నొక్కి నిధులనువిడుదల చేస్తారు. అనంతరం12:05 ని పత్తికొండ కళాశాల మైదానం నుండి హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు.12:05 నుండి 12:30 వరకు స్థానిక నేతలతో మాట్లాడుతారు.12:40 ని హెలిప్యాడ్ ద్వారా కర్నూలుకు బయలుదేరుతారు. అనంతరం 1:05 ని ఓర్వగల్లు ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు.1:10ని విమానం ద్వారా గన్నవరం కి బయలుదేరుతారు.
రేపు పత్తికొండ రానున్న సీఎం జగన్మోహన్ రెడ్డి
RELATED ARTICLES