వరదయ్యపాలెం, డిసెంబర్ 02
ఇందిరా నగర్ పంచాయతీ గ్రామంలో ఎడతెరప లేకుండా కురుస్తున్న వాన సైతం లెక్కచేయ్యకుండా మొదటి రోజు ఎక్కువ శాతం పింఛను పంపిణీ కార్యక్రమం జరిగింది.మొదటి రోజు అందుబాటులో లేని వారి కోసం రెండో రోజు ఫించన్ పంపిణి కార్యక్రమం జరుగుతుంది.ఈ పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఇందిరానగర్ సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ యామిని,బీజేపీ నేత గుత్తి త్యాగరాజు పాల్గొని పింఛన్ పంపిణి చేసారు.ఈ సందర్భంగా స్థానికురాలు,అద్దె ఇంట్లో నివసిస్తూ పింఛను అందుకున్న స్వరూపరాణి పల్లిపట్టు,బీజేపీ నేత గుత్తి త్యాగరాజుతో మాట్లాడుతూ అద్దె ఇంట్లో ఉంటున్న వారికి ప్రభుత్వం స్వంత ఇంటి కల నెరవేర్చాలని కోరారు.ఇందుకోసం కృషి చేయాలని కోరారు.ఇదే రీతిలో ఏ ఎన్ ఎం శాంతి కుమారి,ఆశ వర్కర్ మహాలక్ష్మి కలిసి వరదయ్యపాలెం పంచాయతీ,గోవర్ధన పురం, కాంబాకం రోడ్డు అనిల్ సెంటర్ ప్రాంతంలో వృద్ధాప్య,వితంతు, వికలాంగులకు పింఛన్ పింపిణీ చేస్తున్నందుకు వారిని ఆ ప్రాంతము ప్రజలు అభినందించారు.ఇలా పలు చోట్ల రెండో రోజు కూడ పింఛన్ పంపిణీ కార్యక్రమం కొనసాగింది.ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వం పట్ల పింఛను లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.
రెండవ రోజు కొనసాగిన ఎన్ టి ఆర్ భరోసా పింఛన్ స్కీం పంపిణీ
RELATED ARTICLES