హైదరాబాద్ : జీఎస్టీ రిజిస్ట్రేషన్ కోసం రూ.8000 లంచం తీసుకుంటుండగా మాదాపూర్ సర్కిల్‌కు చెందిన డిప్యూటీ స్టేట్ టాక్స్ ఆఫీసర్ సుధ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడింది.
ఒక వ్యక్తి తన కంపెనీకి సంబంధించిన జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించేందుకు అధికారిని సంప్రదించాడు. ఈ సందర్భంలో ఆఫీసర్ సుధ రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ రూ.8000 లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించగా, వారు పన్నిపెట్టి మంగళవారం ఆమెను లంచం తీసుకుంటున్న సమయంలో పట్టుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
రూ.8000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సర్కిల్ టాక్స్ ఆఫీసర్
RELATED ARTICLES